గరిడేపల్లి, వెలుగు: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వేగంగా స్పందించి బాధితులకు తక్షణ సేవలందించాలని ఎస్పీ నరసింహ పోలీస్అధికారులను ఆదేశించారు. పోలీస్ సెంట్రల్ కంట్రోల్ రూమ్, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ల పనితీరును శుక్రవారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ డయల్-100, పెట్రో కార్, నైట్ పెట్రోలింగ్, హైవే పెట్రోలింగ్, బ్లూ కోట్స్, బీట్ డ్యూటీలను నిరంతరం పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా జిల్లాలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అనుమానస్పద కదలికలపై అధికారులకు సమాచారం అందించి నేరాల నివారణకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్రామారావు, పోలీస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంటర్ ఆర్ఎస్ఐ రాజశేఖర్, పోలీస్ కంట్రోల్ రూమ్ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాలను తగ్గించాలి
సూర్యాపేట: రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రభుత్వ ఉద్యోగులు కృషి చేయాలని డీఎస్పీ ప్రసన్న కుమార్ సూచించారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా పట్టణ మున్సిపల్ ఆఫీసులో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ.. ప్రయాణం చేసే సమయంలో హెల్మెట్ ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడప వద్దని సూచించారు.
పిల్లలకు వాహనాలు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో ఉద్యోగులు, పౌరులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్నవారితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్, ఆర్ఎంఓ లక్ష్మణ్, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, టౌన్ ఎస్ఐలు మహేంద్ర నాథ్, శివ తేజ, ఐలయ్య, ఏఎంవీఐ విక్రమ్, ఏఎంవీఐ సంపత్, ఉద్యోగులు పాల్గొన్నారు.
