
పహల్గాం దాడులకు కౌంటర్గా పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన ఎయిర్ స్ట్రైక్స్ ‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతమైంది. హిస్టరీలో ఫస్ట్ టైం ఇద్దరు మహిళా ఆఫీసర్లు ఆర్మీ ఆపరేషన్పై దేశ ప్రజలకు వివరాలు వెల్లడించారు. ఆర్మీ ఆపరేషన్కు కూడా ‘ఆపరేషన్ సింధూర్’ అని పేరు పెట్టారు. ‘ఆపరేషన్ సింధూర్’ గురించి వివరించేందుకు భారత ఆర్మీ నుంచి కల్నల్ సోఫియా ఖురేషి, ఎయిర్ ఫోర్స్ నుంచి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియా ముందుకు వచ్చారు. దీంతో.. ఈ ఇద్దరు మహిళా ఆఫీసర్ల పేర్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
Jay Hind 🇮🇳
— ARNABANGSHU NEOGI (@REPORTER_ARNAB) May 7, 2025
Wing Commander Vyomika Singh from 🇮🇳 Air Force#IndiaPakistanWar #PahalgamTerroristAttack #sindoor pic.twitter.com/tpVxqkEpmd
ఐఏఎఫ్ బ్యాడ్జ్కు క్వాలిఫై అయిన వ్యోమికా సింగ్ సర్వీస్ నెంబర్ 28261, బ్రాంచ్ నంబర్ F(P). వ్యోమికాకు స్కూల్ డేస్ నుంచే ఎయిర్ ఫోర్స్ పై ఇష్టం ఏర్పడింది. వ్యోమికా అనే పేరులోనే ఆకాశ పుత్రిక అనే అర్థం ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలన్న తన కలను ఆమె ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని సాకారం చేసుకున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయి హెలికాఫ్టర్ పైలట్గా రాణించి.. డిసెంబర్ 18, 2019న ఫ్లైయింగ్ బ్రాంచ్లో పర్మినెంట్ కమిషన్కు అర్హత సాధించారు.
Aslo Read :పాకిస్తాన్ తో ఇప్పటి వరకు 4 యుద్ధాలు
హై రిస్క్ పరిస్థితుల్లో, జమ్ము కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా చాకచక్యంగా చేతక్, చీతా హెలికాఫ్టర్స్ ఆపరేట్ చేసి 2,500 గంటల ఫ్లైయింగ్ అనుభవం వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ సొంతం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన చాలా రెస్క్యూ మిషన్స్లో వ్యోమికా సింగ్ కీలక పాత్ర పోషించారు. నవంబర్ 2020లో అరుణాచల్ ప్రదేశ్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జరిపిన మేజర్ మిషన్స్ను వ్యోమికా సింగ్ లీడ్ చేశారు. హై-ఆల్టిట్యూడ్లో, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో, రిమోట్ లొకేషన్స్లో ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన పలు ఆపరేషన్స్లో వింగ్ కమాండర్గా వ్యోమికా సింగ్ సేవలు మరువలేనివి.