
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్, సౌతాఫ్రికా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫాస్ట్ బౌలర్ షాన్ పొలాక్ తమ ఐపీఎల్ ప్లేయింగ్ 11 ను ఎంచుకున్నారు. క్రిక్ బజ్ లో భాగంగా ఇద్దరూ కలిసి ఐపీఎల్ జట్టును ఎంచుకోవడం విశేషం. ఈ జట్టుకు మహేంద్ర సింగ్ ధోనీని వికెట్ కీపర్ గా, కెప్టెన్ గా ఎంచుకున్నారు. ఓపెనర్లుగా విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ తో పాటు టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీని సెలక్ట్ చేశారు. స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మను పక్కన పెట్టడం ఆశ్చర్యానికి గురి చేసింది. మూడో స్థానంలో సురేష్ రైనా బ్యాటింగ్ కు వస్తాడు. సూర్య కుమార్ యాదవ్, ఏబీ డివిలియర్స్, ధోనీ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేస్తారు.
ఆల్ రౌండర్లుగా జడేజాతో పాటు మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ కు ఛాన్స్ ఇచ్చారు. స్పిన్ విభాగంలో రషీద్ ఖాన్ ఉన్నప్పటికీ నిలకడగా ఆడుతున్న నరైన్ వైపే వీరు మొగ్గు చూపారు. పేస్ బౌలర్లగా టీమిండియా యార్కర్ల వీరుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు శ్రీలంక దిగ్గజ పేసర్ మలింగను ఎంపిక చేశారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా యుజ్వేంద్ర చాహల్ కు ప్లేయింగ్ 11 లో చోటు దక్కింది. వీరు ఎంపిక చేసిన జట్టులో కేవలం ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు మాత్రమే ఉండడం విశేషం. కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, రస్సెల్, రోహిత్, భువనేశ్వర్, రషీద్ ఖాన్, హార్దిక్ పాండ్య లాంటి స్టార్ ఆటగాళ్లకు వీరు చోటు కల్పించలేదు.
ఆడమ్ గిల్‌క్రిస్ట్, షాన్ పొలాక్ ఆల్-టైమ్ XI:
క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, ఏబీ డివిలియర్స్, సూర్యకుమార్ యాదవ్, మహేంద్ర సింగ్ ధోని, రవీంద్ర జడేజా, సునీల్ నరైన్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్
Adam Gilchrist & Shaun Pollock Pick Their All-Time IPL XI | #Cricnet
— CRICNET (@Cricnet_) May 6, 2025
📸BCCI
Source: Cricbuzz pic.twitter.com/jr3O4WL00W