Layoffs : మైక్రోసాఫ్ట్ లో మళ్లీ 276 మంది తీసేశారు

Layoffs : మైక్రోసాఫ్ట్ లో మళ్లీ 276 మంది తీసేశారు

గూగుల్, అమెజాన్,  ట్విట్టర్, మైక్రోసాఫ్ట్ సహా ప్రముఖ సంస్థలు భారీ ఎత్తున ఉద్యోగులను తగ్గించుకున్న విషయం తెలిసిందే.  తాజాగా  మైక్రోసాఫ్ట్  వాషింగ్టన్ కార్యాలయంలోని పనిచేస్తున్న  ఉద్యోగుల్లో 276 మందిని తీసేసింది. ఇందులో 66 మంది వర్చువల్ గా పనిచేస్తున్నవారు ఉన్నారని సంస్థ తెలిపింది.  వీరిలో సేల్స్‌, కస్టమర్‌ సక్సెస్‌ రిప్రజెంటేటివ్స్‌ తాము ఉద్యోగాలు కోల్పోయినట్లుగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తమ క్లౌడ్ కంప్యూటింగ్ బిల్లులో ఖర్చులను తగ్గించుకునేందుకు లేఆఫ్‌లు తీసుకొచ్చిన్నట్లు మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది. 

ఈ ఏడాది జనవరిలో 10 వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గిస్తామ‌ని మైక్రోసాఫ్ట్ ప్రక‌టించిన విషయం తెలిసిందే. అయితే, రానున్న రోజుల్లో గతంలో ప్రకటించిన దానికంటే అదనంగా కోతలు ఉంటాయని తాజాగా వెల్లడించింది. 2024 ఆర్థిక సంవత్సరం మొదటి వారం అనంతరం ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభం కానుందని తెలిపింది. అయితే, పెద్ద ఎత్తున తొలగింపులు ఉంటాయని ప్రకటించిన సంస్థ ఆ సంఖ్య ఎంతన్నది మాత్రం వెల్లడించలేదు.