హుజురాబాద్ లో 120 మంది బరిలోకి దిగుతం

V6 Velugu Posted on Jul 31, 2021

తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే హుజురాబాద్ బైపోల్ లో పోటీ చేస్తామంటున్నారు మిడ్ మానేరు నిర్వాసితులు. ఊరికి 10 మంది చొప్పున 120 మంది పోటీ చేస్తామని తెలిపారు. సర్కార్ తీరుపై నిరసనగా వేములవాడ నంది కమాన్ దగ్గర మిడ్ మానేరు ఐక్య వేదిక ఆద్వర్యంలో నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు, నల్ల బెలూన్స్ తో ధర్నా చేశారు. వేములవాడ రాజన్న సాక్షిగా మిడ్ మానేరు నిర్వాసితులకు 5 లక్షల ఇస్తామన్న సీఎం హామీ ఏమైందని ప్రశ్నించారు. మిడ్ మానేరు ప్రాజెక్ట్ నిర్మాణం కోసం తాము అన్ని త్యాగం చేసామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సర్కార్ తమ సమస్యలను పట్టించుకోకపోతే... ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

Tagged contest, huzurabad bypoll, Mid-Manor residents, 120 people

Latest Videos

Subscribe Now

More News