మా నాన్న త్వరలోనే చనిపోతాడు.. ఓ మధ్యతరగతి కొడుకు ఆవేదన ఇలా

మా నాన్న త్వరలోనే చనిపోతాడు.. ఓ మధ్యతరగతి కొడుకు ఆవేదన ఇలా

పేదవారికి ఖరీదైన జబ్బులు రాకూడదు.. అవి పేదవారి ఇంటి తలుపులు తట్టాయా.. ఇక  రోగితో పాటు వారి బంధువులు కూడా తిప్పలు తప్పవు.. తాను ఎప్పుడు కోలుకుంటా అని రోగి... ఆస్పత్రుల ఖర్చులు ఎలా సమకూర్చాలా అని బంధువులు పడే బాధ అంతా ఇంతా కాదు.  తాజాగా ఇప్పుడు  ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన పల్లవ్​ సింగ్​ అనే వ్యక్తి  సోషల్​ మీడియాలో చేసిన మెస్​  పోస్ట్​ వైరల్​ గా మారింది.   నాతండ్రి త్వరలో చనిపోతారు.. అత్యవసర వైద్య సంరక్షణ అవసరమని  సోషల్​ మీడియాలో పోస్ట్ చేసిన డెస్పెరేట్​ అభ్యర్థన​ చేశారు. 

సెప్టెంబర్​ లో తన తండ్రికి గుండెపోటు వచ్చిందని.. మూడు ధమనులు ఎక్కువ భాగం పనిచేయడం లేదని వైద్యులు నిర్దారించారు.  అప్పుడు పల్లవ్​ స్వస్థలం గోరఖ్​ పూర్​ లో ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స చేయించామని తెలిపాడు.  ఆ తరువాత ఢిల్లీకి మారడం వలన ... ఢిల్లీ ఎయిమ్స్​ లో డాక్టర్​ అప్పాయింట్​ కోసం క్యూలో నిలబడాల్సి వచ్చిందని తెలిపాడు.  ఆపరేషన్​ అయిన వ్యక్తి తదుపరి చెకప్​ ల కోసం క్యూలో ఉండటం చాలా సవాళ్లతో కూడుకున్నదని వివరించాడు.  ఇలా వైద్యులను కలవడం.. శస్త్ర చికిత్సలు చేయించుకోవడం వంటి అంశాలు తమకు సవాళ్లగా మారాయన్నారు. 

తరువాత కొంత కాలానికి వ్యాధి తీవ్రత చాలా ఎక్కువైంది.  అత్యవసర చికిత్స కోసం 45 రోజుల పాటు ఎయిమ్స్​ ఆస్పత్రి చుట్టూ తిరిగామని.. ప్రైవేట్​ ఆస్పత్రిలో సర్జరీ చేయించుకొనే స్థోమత లేదన్నారు.  గతంలో ప్రైవేట్​ ఆస్పత్రిలో సర్జరీ చేయించుకోవడంతో ఉన్న ఇల్లును అమ్మేశామని .. ఇక ఇప్పుడు అమ్మడానికి ఏమీ లేదని రాసుకొచ్చాడు.  పల్లవ్​ 45 రోజుల పాటు ఎంత నరకం అనుభవించాడో వివరించాడు. 

నా తండ్రి డయాబెటిక్​ పేషంట్​ .. 52 ఏళ్ల వయస్సులో గుండె పనితీరులో లోపం వచ్చింది.. దానికి చికిత్స కోసం 13 నెలలు వేచి ఉండాలని పోస్ట్​ చేశారు.  ఈ పోస్ట్​  5 మిలియన్లకు పైగా వీక్షణలను సంపాదించింది.  వైద్యుల ఆఫర్​ లతో  సహాయం చేసేందుకు అశ్విక అనే గ్రూప్​ ముందుకొచ్చింది. ఆన్​లైన్​ ద్వారా సాయం చేసి పల్లవ్​ తండ్రికి వైద్యం చేయించాలని నిర్ణయం తీసుకుంది. మరి ఢిల్లీ ఎయిమ్స్​ లాంటి ఆస్పత్రులో ఇలా ఉంటే.. ఇక సాదా సీదా ఆస్పత్రుల పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.