
హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దగ్గర అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. సిగ్నల్ దగ్గర టర్న్ చేస్తుండగా అదుపుతప్పిన కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఆ కారు వచ్చే వేగంతో పక్కనే వెళ్తున్న వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి. అయితే పోలీసులు దొరికితే కేసు అవుతుందనే భయంతో కారును అక్కడికక్కడే వదిలేసి పరారయ్యాడు. స్థానిక సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సాయంతో కారును తొలగించారు. అయితే ఆ కారు ఎవరిది..? పరారైన వ్యక్తి ఎవరు..? అనే విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు.