హైదరాబాద్ లో అర్ధరాత్రి మళ్లీ దంచికొట్టింది!

 హైదరాబాద్ లో అర్ధరాత్రి మళ్లీ దంచికొట్టింది!

హైదరాబాద్​సిటీ, వెలుగు : గ్రేటర్​ సిటీని వర్షం వదలడం లేదు. మూడు రోజుల పాటు ఆగకుండా కురిసిన వాన మధ్యలో ఒక రోజు గెరువిచ్చినా మంగళవారం అర్ధరాత్రి మళ్లీ దంచి కొట్టింది. బుధవారం పగలంతా వాతావరణం పొడిగా ఉంది. కానీ, రాత్రి 11 గంటల నుంచి మొదలైన వాన రెండు గంటల వరకు నాన్​స్టాప్​గా పడుతూనే ఉంది. 

అత్యధికంగా రాజేంద్రనగర్​లో 5.3 సెంటీమీటర్ల వాన పడింది. బంజారాహిల్స్​లో​5.1, షేక్​పేటలో 5.1, ఖైరతాబాద్​లో  5.0, విజయనగర్​కాలనీ లో 4.8, నాంపల్లి లో4.8, బహదూర్​పురా లో 3.9, లంగర్​హౌస్​     లో 3.7, చార్మినార్​లో 3.5, ఉప్పల్​లో 3.5, గచ్చిబౌలి లో 3.5 సెంటీమీటర్ల వర్షం పడింది.