
హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు చెందిన మిడ్‌వెస్ట్ లిమిటెడ్ తన రూ. 451 కోట్ల ఐపీఓ కోసం షేరుకు రూ. 1,014 నుంచి రూ. 1,065 ప్రైస్ బ్యాండ్‌ను నిర్ణయించింది. ఈ పబ్లిక్ ఇష్యూ అక్టోబర్ 15న సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభమై అక్టోబర్ 17న ముగుస్తుంది.
యాంకర్ బుక్ అక్టోబర్ 14న ఓపెన్ అవుతుంది. ఈ ఐపీఓలో రూ. 250 కోట్ల విలువైన తాజా షేర్లు, రూ. 201 కోట్ల విలువైన ఓఎఫ్ఎస్ ఉంటాయి. ఈ నిధులలో రూ. 130.3 కోట్లను క్వార్ట్జ్ సౌకర్యం ఫేజ్ 2 విస్తరణకు, రూ. 25.7 కోట్లను ఎలక్ట్రిక్ డంప్ ట్రక్కులకు, రూ. 56.2 కోట్లను అప్పుల చెల్లింపు కోసం ఉపయోగిస్తారు.