
ఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. రష్యన్ మేడ్ మిస్ 21 ఫైటర్ ఫ్లైట్లకు వీడ్కోలు పలకనుంది. భారత గగనతలాన్ని రక్షిస్తున్న ఈ యుద్ధ విమా నాలకు సెప్టెంబర్ లో ఐవీఎఫ్ రిటైర్మెంట్ ప్రకటించింది. వీటిని స్వదేశీ పరిజ్ఞానం తో అభివృద్ధి చేసిన తేజస్ మార్క్ 1ఏడో భర్తీ చేయనున్నారు.
మిగ్-21 భారతీయ వైమానిక దళంలో కీలక పాత్ర పోషించింది. 1963లో తొలిసారి ఇండియా మిగ్ 21 విమానాలను వాడటం మొదలు పెట్టింది. మిగ్-21 భారత వైమానిక దళంలో సేవలో మొట్టమొదటి సూపర్‌సోనిక్ యుద్ధ విమానం.ఆరు దశాబ్దాలకు పైగా ఈ ఫైటర్ జెట్లు తమ సా మర్థ్యాన్ని ప్రదర్శించాయి. బసివిర్ దగ్గర ప్రస్తుతం 16 మిగ్-21 విమానాలు ఉన్నాయి.
►ALSO READ | మిగ్ 21 ఫైటర్ జెట్లకు ఇండియా గుడ్ బై: ఆర్మీ నుంచి వీటిని తీసేయాలని నిర్ణయం
MiG-21 యుద్ధ విమానాల తొలగింపు వెనుక ఉన్న అతి పెద్ద కారణాలలో ఒకటి వాటి భద్రతా రికార్డు సరిగా లేకపోవడం. నివేదికల ప్రకారం..వాటిని ప్రవేశపెట్టినప్పటి నుంచి 400 కంటే ఎక్కువ MiG-21 విమానాలు కూలిపోయాయి. ఈ ప్రమాదాలలో చాలా వరకు ఓల్డ్ టెక్నాలజీ, ఇంజిన్ ఫెయిల్యూర్స్ కారణంగా సంభవించాయి. కాగా ఇటీవలి కాలంలో ఈ విమానాలు పలు ప్రమాదాలకు కారణమయ్యాయి.
2025 చివరి వాటిక్ మిస్21 విమానాలను తొలగించి వాటి స్థానంలో లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ మార్క్ 12 విమానాలను విని యోగించనున్నట్లు అధికారులు తెలిపారు.