
ఇండియన్ ఆర్మీని పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు యుద్ధ విమానాలు అంటే మిగ్ 21 ఫైటర్ జెట్స్.. ఈ యుద్ధ విమానాలే ఇటీవల పాకిస్తాన్ వెళ్లి మరీ అక్కడి ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసి వచ్చాయి. అంతే కాదు బాలకోట్ వైమాజిక దాడి వెనక కూడా ఈ మిగ్ 21 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఈ మిగ్ 21 ఫైటర్ యుద్ధ విమానాలకు గుడ్ బై చెప్పాలని భారత్ నిర్ణయించింది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది.
మిగ్ 21 ఫైటర్ జెట్స్ను వీడ్కోలు చెప్పటానికి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని కూడా ఇండియన్ ఆర్మీ డిసైడ్ కావటం విశేషం. మిగ్ 21 యుద్ధ విమానాలను.. తేజాస్ Mk1A ఫైటర్ జెట్స్ తో భర్తీ చేయనున్నారు. ఈ MiG-21 ఫైటర్ జెట్స్ తొలిసారిగా 1963లో ట్రయల్ బేసిస్పై సర్వీస్లోకి ఎంటర్ అయ్యాయి. రష్యాలో తయారైన MiG-21 ఫైటర్ జెట్స్ 2000వ సంవత్సరం దాకా భారత వైమానిక దళానికి వెన్నెముకగా నిలిచాయి. Sukhoi Su-30MKIs భారత్ కొనుగోలు చేశాక MiG-21 ప్రాభవం తగ్గుతూ వచ్చింది.
ఇక.. తేజస్ యుద్ధ విమానాల విషయానికొస్తే.. ‘తేజస్’ తేలికపాటి యుద్ధ విమానాన్ని స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) దీన్ని రూపొందించింది. యాక్టివ్ ఎలక్ట్రానిక్- స్కాన్డ్ అర్రే రాడార్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్ వంటి సామర్థ్యాలు దీని ప్రత్యేకత.