స్విమ్మింగ్ పూల్స్ ఓపెన్ చేయకపోతే రిటైర్మెంట్ తీసుకుంటా!

స్విమ్మింగ్ పూల్స్  ఓపెన్ చేయకపోతే రిటైర్మెంట్ తీసుకుంటా!

ఔట్ డోర్ ట్రెయినింగ్ కు  అనుమతి ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్.. స్విమ్మింగ్ పూల్స్‌ ఓపెన్‌ చేసేందుకు పర్మిషన్‌ ఇవ్వకపోవడంతో స్విమ్మరకు ఎదురుచూపులు తప్పడం లేదు. దాదాపు మూడు నెలల నుంచి ప్రాక్టీస్‌కు దూరం కావడంతో ఇండియా స్టార్‌స్విమ్మర్‌, ఏషియన్‌గేమ్స్‌బ్రాంజ్‌ మెడలిస్ట్‌ ‌వీర్‌ధవల్ ‌‌ఖడే ఫ్రస్ట్రేట్ ‌అవుతున్నాడు. పూల్స్‌ ఓపెన్‌ చేయకపోతే రిటైర్మెంట్‌ తీసుకునే ఆలోచనలో ఉన్నానని ఆదివారం చెప్పాడు. ట్రెయినింగ్‌ ఆలస్య మైతే టోక్యో ఒలింపిక్స్ ‌ముందు ఇండియా స్విమ్మర్లు చాలా నష్టపోతారని అన్నాడు. ‘పరిస్థితి ఇలానే ఉంటే స్విమ్మింగ్‌కు రిటైర్మెంట్‌ ఇచ్చే అంశాన్ని పరిగణించాల్సి ఉంటుంది. మన దేశంలో స్విమ్మింగ్‌ పూల్స్‌‌ను ఎప్పుడు ఓపెన్ ‌చేస్తారనే విషయంలో ఎలాంటి సమాచారం లేదు. ఇండియాలో స్విమ్మింగ్‌‌ను కూడా ఇతర ఆటల మాదిరిగానే ట్రీట్‌చేస్తే బాగుంటుంది. 3 నెలల నుంచి ఇండియా స్విమ్మర్లంతా పూల్‌‌లోకి ఎంటర్‌ కాలేదు. ఇతర ఆటల్లో అథ్లెట్లు సోషల్‌‌డిస్టెన్స్ మెయింటేన్‌ చేస్తూ ట్రెయినింగ్‌లో పాల్గొన్నప్పుడు మేం కూడా అలానే చేయగలం కదా. అయినా ఈ రిస్ట్రిక్షన్స్ ‌ఎందుకో మరి. నేనైతే చాలా ఇబ్బంది పడుతున్నా. ఒలింపిక్స్‌పై ఆశలు పెట్టుకున్న మరే స్విమ్మర్‌ ఈ కారణంగా రిటైర్మెంట్‌ ఆలోచన చేయబోడని ఆశిస్తున్నా’ అని ట్వీట్‌ చేసిన వీర్‌ధవన్‌.. స్పోర్ట్స్‌ స్పోర్ట్ మినిస్టర్‌ కిరణ్‌ రిజిజు, స్విమ్మింగ్‌ ఫెడరేషన్లను ట్యాగ్ ‌చేశాడు.