టిక్ టాక్ లో బాధపడిన కొన్నిరోజులకే మృతి

టిక్ టాక్ లో బాధపడిన కొన్నిరోజులకే మృతి

ఇంటికి రాలేక.. గుండె ఆగింది

కొద్దిరోజుల ముందే టిక్ టాక్ లో ఆవేదన
సౌదీలో వలస కార్మికుడి మృతి

పరిగి, వెలుగు: ఈడ చచ్చినా చూసేవాడు లేడు.. గల్ఫ్ జీవితం గంగపాలే తల్లీ.. వలస జీవి బతుకు ఎన్నడు మారు.. ఎవ్వరొచ్చి ఆదుకుంటరో నాయమ్మా… అంటూ ఓ గల్ఫ్ జీవి ఇటీవలే టిక్ టాక్ చేశాడు. కొద్దిరోజులకే ఆ వలస జీవి గుండె ఆగిపోయింది. వికారాబాద్ జిల్లా పరిగి డివిజన్ దోమ మండలం దాదాపూర్ గ్రామానికి చెందిన ఫయాజ్(38) బతుకుదెరువు కోసం ఏడాది క్రితం సౌదీ వెళ్లాడు. తన ఇద్దరి చెల్లెళ్ల పెళ్ళళ్లకైన అప్పులు తీర్చేందుకు సౌదీలోని షాపింగ్ మాల్లో పని చేస్తున్నాడు. తల్లీ, భార్య, ఇతర కుటుంబీకులను చూసేందుకు రెండు నెలలుగా స్వగ్రామానికి రావాలనుకుంటున్నాడు. కరోనా కారణంగా రాలేకపోయాడు. కుటుంబీకులను ఇప్పట్లో కలుస్తానో లేదో అంటూ తీవ్ర మనోవేదనకు గురై ఇటీవలే వలస జీవుల జీవితం గంగపాలు అంటూ టిక్ టాక్ చేశాడు. మనోవేదనతో గుండెపోటు రావడంతో బుధవారం సౌదీలోనే మృతిచెందాడు. కరోనా కారణంగా చివరిచూపు చూసేందుకు కూడా వీలు లేకుండా పోయిందంటూ కుటుంబీకులు విలపించారు.

కరోనాతో సౌదీలో మృతి
నర్సంపేట, వెలుగు: వలస కార్మికుడు సౌదీలో కరోనాతో మృతిచెందాడు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట డివిజన్ నల్లబెల్లి మండలంలోని గ్రామానికి చెందిన వ్యక్తి(50) పదేళ్ల క్రితం సౌదీలోని రియాద్ కు వెళ్లారు. అక్కడ టైలరింగ్ చేస్తూ ఇంటికి డబ్బులు పంపుతున్నారు. ఇటీవల ఆయనకు కరోనా సోకింది. ట్రీట్ మెంట్ పొందుతూ బుధవారం మృతిచెందాడు. సమాచారం అందుకున్న భార్య, కొడుకు, కూతురు కన్నీళ్ల పర్యంతమమయ్యారు. కడసారి చూపు కూడా దక్కలేదని వాపోయారు.

For More News..

శవాలు మళ్లీ మారినయ్

జనాలకే కరోనా రూల్స్.. లీడర్లకు కాదు..

డ్యూటీకి రాకపోతే ఫైన్!