లాక్డౌన్ లో సొంతూరికి వెళ్లడం కోసం ఏం దొంగతనం చేశాడో తెలుసా..

లాక్డౌన్ లో సొంతూరికి వెళ్లడం కోసం ఏం దొంగతనం చేశాడో తెలుసా..

లాక్డౌన్ వల్ల సొంతూరికి వెళ్లడానికి వాహనాలు లేక దొంగతనం చేశాడో ప్రబుద్దుడు. అయితే ఏం దొంగతనం చేశాడో తెలుసా.. తన ఎదురింటి వ్యక్తికి చెందిన సైకిల్ ను దొంగతనం చేసి, దానిపై తన కొడుకుతో సొంతూరికి బయలుదేరాడు. మహ్మద్ ఇక్బాల్ ఖాన్ అనే కార్మికుడు రాజస్థాన్ లోని భరత్ పూర్ లో పనిచేస్తున్నాడు. అయితే లాక్డౌన్ వల్ల ఇబ్బందులు తలెత్తడంతో సొంతూరు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. కానీ, అతని దగ్గర డబ్బులు లేవు. పైగా అతని కొడుకు వికలాంగుడు. నడవలేని తన కొడుకును తీసుకొని ఎలాగైనా తన సొంతూరు ఉత్తర ప్రదేశ్ లోని బరేలీకి వెళ్లాలనుకున్నాడు. దాంతో తన ఎదురింటి వ్యక్తి సాహిబ్ సింగ్ ఇంటి ముందున్న సైకిల్ ను దొంగతనం చేయాలని అనుకున్నాడు. అయితే అది తప్పని ఇక్బాల్ కు తెలుసు.. కానీ, తప్పని పరిస్థితి. దాంతో సైకిల్ ను దొంగతనం చేసి.. సాహిబ్ సింగ్ ఇంటిముందు ఒక లెటర్ రాసి పెట్టాడు.

ఆ లెటర్ లో ‘నానే నీ సైకిల్ ను దొంగతనం చేస్తున్నాను. వీలైతే నన్ను క్షమించు. నాకు ఒక కొడుకు ఉన్నాడు. వాడు వికలాంగుడు. నడలేని స్థితి వాడిది. అందుకే నేను ఇలా చేస్తున్నాను. దానిపైనే మేం బరేలీ వరకు వెళ్ళాలి’ అని రాసి పెట్టాడు.

అది చూసిన సాహిబ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని అనుకున్నాడు. కానీ.. ఇక్బాల్ పరిస్థితి అర్థంచేసుకొని తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.

For More News..

టోల్ గేట్ రేకులు కూలి దంపతులు మృతి

లాక్డౌన్ లో సీజ్ అయిన బండి కావాలంటే ఇలా చేయాల్సిందే!