భూమి గుండ్రంగా లేదని..సొంత రాకెట్ లో ఎగిరి బలైండు

భూమి గుండ్రంగా లేదని..సొంత రాకెట్ లో ఎగిరి బలైండు

ఆయన పేరు మైక్ హగ్స్. అందరూ ‘మ్యాడ్’ మైక్ అంటుంటారు. భూమి గుండ్రంగా లేదని, ఫ్లాట్ గా ఉందన్నది ఆయన వాదన. ఎప్పటికైనా దానిని ప్రూవ్ చేసి తీరతానంటూ.. సొంతంగానే రాకెట్లు తయారు చేసుకుని అంతరిక్షానికి ఎగిరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలోనే.. 64 ఏళ్ల వయసులో బలైపోయారు. శనివారం అమెరికాలోని కాలిఫోర్నియా సమీపంలో బార్ స్టో వద్ద సొంతంగా తయారు చేసిన స్టీమ్ ఇంజన్​తో నడిచే రాకెట్​ను మైక్ సిద్ధం చేసుకున్నారు. పైకి ఎగిరిన కొద్ది సేపటికే అది కూలిపోవడంతో ఆయన చనిపోయారు. 2018లో ఇలాంటి ప్రమాదం నుంచి ఆయన బయటపడ్డారు.