
బాక్సింగ్ అనగానే చాలామందికి గుర్తొచ్చే పేరు ‘మైక్ టైసన్’. బాక్సింగ్ రింగ్‌లో ఆయన ఇచ్చే పంచుల్ని అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. అలాంటి వరల్డ్ ఫేమస్ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ ‘లైగర్’ మూవీలో నటిస్తుండటం విశేషం. విజయ్ దేవరకొండ హీరోగా బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో పిడికిలి బిగించి పంచ్ ఇస్తూ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు టైసన్. ‘నమస్తే ఇండియా.. రెడీగా ఉండండి’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ పోస్టర్ని షేర్ చేసి, దీపావళి విషెస్ చెప్పారాయన. టైసన్‌తో పాటు పలువురు ఫారిన్ ఫైటర్స్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతోంది. థాయిలాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్సుల్ని కంపోజ్ చేస్తున్నారు. విష్ణుశర్మ కెమెరామేన్. విజయ్‌కి జంటగా అనన్య పాండే నటిస్తోంది. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్‌పాండే, గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. కరణ్ జోహార్, అపూర్వ మెహతా, పూరి జగన్నాథ్, చార్మి కలిసి నిర్మిస్తున్నారు. వచ్చే సమ్మర్‌లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.