మంచిర్యాల జిల్లాలో సీఎం, మంత్రి, ఎంపీ ఫోటోలకు క్షీరాభిషేకాలు

మంచిర్యాల జిల్లాలో సీఎం, మంత్రి, ఎంపీ ఫోటోలకు క్షీరాభిషేకాలు
  • కార్మికులకు వేతనాల పెంపుపై హర్షం

కోల్​బెల్ట్/జైపూర్​/పెద్దపల్లి, వెలుగు: రాష్ట్రంలోని 1.11 కోట్ల మంది కార్మికులకు కనీస వేతనాలు పెంచిన ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తూ శుక్రవారం సీఎం రేవంత్​రెడ్డి, కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి,పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫోటోలకు కాంగ్రెస్ నేతలు, మున్సిపల్ ​కార్మికులు వేర్వేరుగా క్షీరాభిషేకాలు చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని పాత బస్టాండ్​ఏరియాలో, క్యాతనపల్లిలోని రామకృష్ణాపూర్​ కాంగ్రెస్ ఆఫీస్​లో టౌన్ ​ప్రెసిడెంట్లు మంద తిరుమల్​రెడ్డి, వొడ్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. డీసీసీ ప్రెసిడెంట్​రఘునాథ్​రెడ్డి, జనరల్​సెక్రటరీ పుల్లూరి లక్ష్మణ్, లీడర్లు ఎస్.సుదర్శన్, బండి సదానందం, మందమర్రి టౌన్​ఇన్​చార్జ్ గోపతి బానేశ్, ఉపేందర్​గౌడ్, పల్లె రాజు ​ తదితరులు పాల్గొన్నారు. 

ఇటీవల గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చారని, కార్మిక లోకానికి కనీస వేతనాలను పెంచడంలో కీలకంగా వ్యవహరించిన మంత్రి వివేక్​ వెంకటస్వామికి ధన్యవాదాలు తెలిపారు. పెద్దపల్లి జిల్లాకేంద్రంలో కాంగ్రెస్​ లీడర్లు సీఎం, మంత్రి వివేక్​ ఫొటోలకు క్షీరాభిషేం చేశారు.  లీడర్లు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి మంత్రి వివేక్​ వెంకటస్వామి కృషి చేస్తున్నారని కొనియాడారు. కాంగ్రెస్ లీడర్లు సయ్యద్​ సజ్జాద్​, బండారి సునీల్, అడ్డగుంట శ్రీనివాస్​  తదితరులు పాల్గొన్నారు.