దుబ్బాకలో సీఎం రేవంత్, మంత్రి వివేక్ ఫొటోలకు క్షీరాభిషేకం

దుబ్బాకలో సీఎం రేవంత్, మంత్రి వివేక్ ఫొటోలకు క్షీరాభిషేకం

దుబ్బాక, వెలుగు: దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నిధులను మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చా ర్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఫొటోలకు బుధవారం కాంగ్రెస్ శ్రేణులు వేర్వేరుగా క్షీరాభిషేకం చేశారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నర్మెట్ట ఏసు రెడ్డి దుబ్బాక బస్టాండ్లో, కూడవెళ్లి ఆలయ కమిటీ చైర్మన్ ఊష య్యగారి రాజిరెడ్డి సమక్షంలో చేర్వాపూర్వార్డులో, లచ్చపేట వార్డులో కాంగ్రెస్ లీడర్లు సీఎం, ఇన్చార్జి మంత్రుల ఫొటోలకు క్షీరాభిషేకాలు చేశారు. 

ఈ సం దర్భంగా లీడర్లు మాట్లాడుతూ దుబ్బాక పట్టణాభివృద్ధికి గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇన్చార్జి మంత్రి వివేక్, నియోజకవర్గ ఇన్ చార్జి శ్రీనివాస్ రెడ్డి కృషితో రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 కోట్లు విడుదల చేసిందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేశ్, శరభయ్య, ఎండీ రఫీయోద్దిన్, భరత్, శ్రీకాంత్, సాయి గౌడ్, సురేశ్, శ్రీనివాస్, రాములు తదితరులు పాల్గొన్నారు.