అన్నమయ్య జిల్లాలో స్కూల్ బస్సును ఢీకొన్న పాల వ్యాన్

అన్నమయ్య జిల్లాలో స్కూల్ బస్సును ఢీకొన్న పాల వ్యాన్

అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాజంపేటలో శ్రీ చైతన్య స్కూల్ బస్సును పాల వ్యాన్ ఢికొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలయ్యాయి. డ్రైవర్ ను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికుల సహాయంతో విద్యార్థులను బస్సులో నుంచి బయటకు దింపారు. బస్సులో ఉన్న విద్యార్థులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో.. విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు. 

ఈ ప్రమాదంలో స్కూల్ బస్సు ముందు అద్దం పూర్తిగా ధ్వంసం అయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.