Tamannaah: మిల్కీ బ్యూటీ ప్లాన్ మారింది: పెళ్లి, పిల్లల గురించి తమన్నా ఏం చెప్పిందంటే!

Tamannaah: మిల్కీ బ్యూటీ ప్లాన్ మారింది: పెళ్లి, పిల్లల గురించి తమన్నా ఏం చెప్పిందంటే!

అందం, డ్యాన్స్, యాక్టింగ్ తో అదరగొట్టి తమన్నా భాటియా వయసు ఇప్పుడు 35 ఏండ్లు. ఒకప్పుడు హీరోయిన్ గా వరుస సినిమాలు చేసిన ఈ మిల్కీ బ్యూటీ ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ తో సెన్సేషనల్ గా మారింది. తమన్నా త్వరలో విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో రూ పొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'ఓ. రోమియో'లో షాహిద్ కపూర్ సరసన కనిపించనుంది. అలాగే 'వవన్ ఫోర్స్ ఆఫ్ ది ఫొరెస్ట్'లోనూ నటిస్తోంది. బాలాజీ మోషన్ పిక్చర్స్, టీవీఎఫ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది మేలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

 అయితే లేటెస్ట్ గా  30 ఏండ్ల వయస్సులో ఉన్న హీరోయిన్ల పట్ల సినీ ఇండస్ట్రీలో మారుతున్న మనస్తత్వం గురించి  ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది తమన్నా. తెరపై వయస్సు, అనుభవాన్ని ఎలా ఎక్కువగా గౌరవిస్తున్నారో స్పష్టం చేసింది. నేను 10 ఏండ్ల ప్రణాళికతో ఇండస్ట్రీకి వచ్చా. ముప్పైలలోకి వచ్చే వరకు పని చేస్త. ఆ తర్వాత పెళ్లి చేసుకుని పిల్లలను కంటానని అనుకున్న, కానీ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెప్పుకొచ్చింది.

►ALSO READ | 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ: సీఎం రేవంత్

కానీ మంచి విషయం ఏమిటంటే, నేను పని చేస్తున్నప్పుడు నా ఇరవైల చివర్లో ఉన్నప్పుడు, నేను నిజంగా నా సొంత వ్యక్తిత్వాన్ని తెలుసుకోగలిగానని తమన్నా తెలిపింది. అప్పటికే, అదృష్టవశాత్తూ పరిశ్రమ శక్తివంతమైన పాత్రలను రాయడం ప్రారంభిచింది. ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఒక సాధారణ మార్పు అని నేను అనుకుంటున్న.  అయితే వయస్సుపై ఈ భయం ఎందుకో నాకు అర్థం కావడం లేదు. చాలా మంది వృద్ధాప్యం ఒక వ్యాధి అయినట్లు మాట్లాడుతారు. వృద్ధాప్యం చాలా అద్భుతమైనది' అని తమన్నాపేర్కొంది.