
ధర్మం కోసం తాను చావడానికైనా సిద్ధమని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వెల్లడించారు. రాముడిని కించపరుస్తూ మునావర్ ఫారుఖీ షో చేశారన్నారు. అతను హైదరాబాద్ కు వస్తే..తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడం జరిగిందన్నారు. ఈ విషయంలో దండం పెట్టి వేడుకున్నా పోలీసులు వినలేదన్నారు. రాముడిని కించపరిచిన వ్యక్తికి పోలీసులు ఎలా రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. మునావర్ ఫారుఖికి కౌంటర్ వీడియోలు చేస్తానని ముందే చెప్పినట్లు.. అలా చేసిన వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించారని విమర్శించారు.
రెండో భాగానికి సంబంధించిన వీడియో త్వరలో అప్ లోడ్ చేస్తాననని వెల్లడించారు. యాక్షన్ కు రియాక్షన్ కచ్చితంగా ఉంటుందని తెలిపారు. తనపై ఎలాంటి చర్యలకు దిగిన తాను రెడీ అంటూ ప్రకటించారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ నిన్న రాత్రి పీఎస్ లో మలక్ పేట ఎమ్మెల్యే బలాలా ఫిర్యాదు చేశారు.