తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎంఐఎం మద్దతు..

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎంఐఎం మద్దతు..

రానున్న తెలంగాణ అసెంబ్లీలో ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతు తెలిపింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. ఎంఐఎం పోటీ చేయని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. 

ఎంఐఎం పోటీ చేయని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు ముస్లింలు ఓటు వేసి గెలిపించాలని అసదుద్దీన్ ఓవైసీ కోరారు.  ఎంఐఎం అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. సచివాలయంలో కూలిపోయిన మసీదును సీఎం కేసీఆర్ కట్టించారని గుర్తు చేశారు. దమ్ముంటే రాహుల్ గాంధీ తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు.