
హైదరాబాద్ : మినరల్ వాటర్‌కు ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా అమ్ముతున్నారు. పర్మిషన్ లేకుండా బోర్లు వేస్తూ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ లు ఏర్పాటు చేస్తున్నారు. వాటిని అడ్డుకోవాల్సి న అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నా రు. ఈ నీటి దందా రోజుకూ రూ.కోట్లలో వ్యాపారం సాగుతుంది. వేసవిలో నగరంలో నీటి ఎద్దడి సామాన్య జనాలకు చుక్కలు చూపిస్తోంటే.. నీటి వ్యాపారులకు మాత్రం కాసుల పంట పండిస్తోంది. చాలా ప్రాంతాల్లో అధికారుల అండతోనే ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్వాహకులు నీటి వ్యాపారం చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు.
25 లీటర్ల క్యాన్ రూ.40
25 లీటర్ల నీటి క్యానుకు రూ.15, 20 తీసుకోవాల్సి ఉండగా రూ. 40 దాకా వసూలు చేస్తున్నారు. బోర్లు ఎండిపోయి, వాటర్‌బోర్డు సరఫరా చేసే నీళ్లు సరిపోక చాలా మంది మినరల్ వాటర్ క్యాన్ లు కొనుగోలు చేస్తున్నా రు. వేసవిలో ఎక్కువగా డిమాండ్ ఉండగా కొందరు అక్రమార్కులు తమ ఇంటిలోనే వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేసి అనుమతులు లేకుండా అక్రమంగా నీళ్ల దందా కొనసాగిస్తున్నా రు.
రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం
ముషీరాబాద్, కవాడిగూడ, గాంధీనగర్, దోమలగూడ, లోయర్ ట్యాంక్‌బండ్, రాం నగర్, అడిక్‌మెట్, పార్శిగుట్ట, సీతాఫల్‌మండి సురేష్ థియేటర్ వద్ద, వారాసిగూడ, అంబర్ ట, నల్లకుంట, పటేల్‌నగర్, ప్రేమ్‌నగర్, ఆజాద్‌నగర్, రెడ్‌బిల్డింగ్, మల్లికార్ జున్ నగర్, రహమత్‌నగర్, సుభాష్‌నగర్, దాసారంబస్తీతో పాటు సిటీ పరిధిలోని శివారు కాలనీల్లోని ప్రాంతాల్లో బోర్లు వేసి ప్లాంట్ లు పెట్టుకొని నీటి ని అమ్ముతున్నా రు. కొన్ని ప్రాంతాల్లో ప్లాం ట్ కోసం ఆరున్నర ఇంచుల బోర్లు వేయడంతో పరిసరాల చుట్టూ బోర్లు ఎండిపోతున్నా యని స్థా నికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా మరికొం దరు అక్రమంగా కొనసాగిస్తున్నా రు. ఈ నీటి దందాపై రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్లే మినరల్ వాటర్ ప్లాంట్ లు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.
తనిఖీలు చేయని అధికారులు
సిటీలో యథేచ్ఛగా వేల సంఖ్యలో వాటర్ ప్లాంట్ లు ఏర్పా టు చేస్తున్నా రు. అనుమతులు లేని మినరల్ వాటర్ ప్లాంట్స్ పెద్ద సంఖ్యలో నడుస్తున్నాయి. రోజూ లక్షల లీటర్ల నీటి క్యాన్లను అమ్ముతూ కోట్ల రూ పాయలలో వ్యాపారం చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. తనిఖీలు చేసి సీజ్ చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నరనే ఆరోపణలు ఉన్నాయి . ఈ నీళ్ల వ్యాపారంపై దాడులు, సర్వేలు చేయాల్సి ఉన్నా ప్రస్తు తం ఎన్నికల క్రమంలో దృష్టి సారించలేకపోతున్నా మని సంబంధిత అధికారులే చెప్తున్నారు.