ఒక్క వీడియోకి వెయ్యి కోట్ల వ్యూస్.. మీరు చూశారా?

ఒక్క వీడియోకి వెయ్యి కోట్ల వ్యూస్.. మీరు చూశారా?

యూట్యూబ్​లో వీడియోలకు లక్షల్లో వ్యూస్​ వస్తేనే గొప్ప. అలాంటిది వెయ్యికోట్ల వ్యూస్​ అంటే ఆ వీడియోకి ఉన్న పాపులారిటీ అర్థమ వుతుంది.‘మైన్​క్రాఫ్ట్’ అనే వీడియో గేమ్​ని వెయ్యికోట్ల మంది చూశారు. ఇన్ని వ్యూస్​ సంపాదించిన మొదటి ​ వీడియోగేమ్​ ఇదే. ‘మైన్​క్రాఫ్ట్​’ సాధించిన ఈ రికార్డు కి గుర్తుగా యూట్యూబ్​ సంస్థ తమ లోగోని వెయ్యి కోట్ల అంకెలతో డిజైన్ చేసింTది. ‘మైన్​క్రాఫ్ట్’ అనేది శాండ్​బాక్స్​ వీడియో గేమ్. దీన్ని స్వీడన్​కి చెందిన వీడియోగేమ్స్​ చేసే ‘మొజాంగ్​ స్డూడియోస్’ డిజైన్​ చేసింది.  పదేండ్ల క్రితం వచ్చిన ఈ గేమ్​ ఆడేవాళ్లు, చూసేవాళ్లు కోట్లలో ఉన్నారు. పోయిన ఏడాది యూట్యూబ్​లో ఎక్కువమంది చూసిన వీడియోగా ‘మైన్​క్రాఫ్ట్​’ నిలిచింది.150 దేశాల్లో ఈ గేమ్​ క్రియేటర్స్​ ఉన్నారు. కోటి నలభై లక్షలమంది కంప్యూటర్​ లేదా ఫోన్లలో ఈ గేమ్​ ఆడుతున్నారు.