ఆదిలాబాద్ జిల్లాలో.. జులై 28న మినీ జాబ్ మేళా.. హైదరాబాద్ అపోలో ఫార్మసీలో ఉద్యోగాలు

ఆదిలాబాద్ జిల్లాలో.. జులై 28న మినీ జాబ్ మేళా.. హైదరాబాద్ అపోలో ఫార్మసీలో ఉద్యోగాలు

నస్పూర్, వెలుగు: కలెక్టరేట్ లోని టాస్క్ శిక్షణ కేంద్రంలో ఈ నెల28న ఉదయం10.30 గంటలకు మినీ జాబ్​మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీ హైదరాబాద్ లో పని చేసేందుకు 40 ఫార్మసిస్టు (స్త్రీ/పురుషులు), 20 ట్రైనీ ఫార్మసిస్టు(పురుషులు), 30 ఫార్మసీ అసిస్టెంట్(పురుషులు), 10 రిటైల్ ట్రైనీ అసోసియేట్​(పురుషులు) పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.

 ఎస్సెస్సీ, ఇంటర్, డి, బి, ఎం.-ఫార్మసీ అర్హత కలిగిన 18 నుంచి --35 ఏండ్ల వయసువారు ఇంటర్వ్యూకు రావాలన్నారు. పూర్తి వివరాల కోసం 82476 56356, 77022 84181, 99634 52486, 91103 68501 ఫోన్ ​నంబర్లలో సంప్రదించాలని సూచించారు.