
హైదరాబాద్ సిటీ, వెలుగు: బంజారాహిల్స్ లోని హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో ఆదివారం నందోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హరేకృష్ణ మూవ్మెంట్వ్యవస్థాపకులు శ్రీల ప్రభుపాదుల 129వ వ్యాసపూజ మహోత్సవం నిర్వహించారు. భక్తులు 1,008 రకాల నైవేధ్యాలను సమర్పించారు.
ఇదే వేడుకలో వ్యాసపూజ – 2025 పుస్తకాన్ని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, హరే కృష్ణ మూవ్మెంట్ హైదరాబాద్ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస ప్రభూజీతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీల ప్రభుపాదుల బోధనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి శిష్యులు ,భక్తులకు ప్రేరణగా నిలుస్తున్నాయన్నారు.