స్టువర్టుపురం దొంగల బ్యాచ్..దోచుకోవడం.. దాచుకోవడమే పనిగా బీఆర్ఎస్ పాలన సాగింది: మంత్రి అడ్లూరి

స్టువర్టుపురం దొంగల బ్యాచ్..దోచుకోవడం.. దాచుకోవడమే పనిగా బీఆర్ఎస్ పాలన సాగింది: మంత్రి అడ్లూరి
  • హరీశ్​రావు వెంటనే క్షమాపణ చెప్పాలని ఫైర్​

హైదరాబాద్, వెలుగు:  బీఆర్ఎస్​ది స్టువర్టుపురం దొంగల బ్యాచ్​అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్​ఆరోపించారు. వారి పదేండ్ల పాలన దోచుకోవడం.. దాచుకోవడమే పనిగా సాగిందని విమర్శించారు. కానీ, ప్రజాపాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సోమవారం ఆయన మినిస్టర్ క్వార్టర్స్ లో మీడియాతో మాట్లాడారు. ‘‘మా మంత్రివర్గాన్ని దండుపాళ్యం బ్యాచ్ అంటారా? మీదే స్టువర్టుపురం దొంగల బ్యాచ్’’ అంటూ బీఆర్ఎస్​ నేత హరీశ్​పై ఫైర్​అయ్యారు.

 హరీశ్​వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. ‘‘మా కేబినెట్​లో బీసీలు, ఎస్సీ లు, ఎస్టీలు ఉన్నారు. నీ దండు, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నరు. మీ కేబినెట్​లో ఎవరైనా నోరు తెరిచి మాట్లాడారా? నువ్వు మాట్లాడిన మాటలపై సిద్దిపేట గుడికి రమ్మని సవాలు విసిరాను. నువ్వు తోకముడిచినవ్. చర్చకు రాలే. నువ్వు కాకుండా ఇంకొకరిని అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పంపిస్తానని చెప్పినవ్. 

ప్రభుత్వంపై బురద చల్లాలనేదే మీ ఎజెండా. మొదట మీ కుటుంబ సభ్యురాలు కవిత మాట్లాడిన మాటలపై సమాధానం చెప్పు” అని మంత్రి హితవు పలికారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. కేసీఆర్ అడ్రస్ లేదని.. ఇక, క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారో? రారో? తెలియదన్నారు.  వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. హరీశ్​రావు తాటిచెట్టు లాగా పెరిగి.. మమ్మల్ని దండుపాళ్యం బ్యాచ్​అంటున్నారని.. బీఆర్ఎస్​ నాయకులంతా డెకాయిట్లు, రాబర్ బ్యాచ్ అని విమర్శించారు.