ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం: పవన్ జాగీర్ వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి ఫైర్

ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం: పవన్ జాగీర్ వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి ఫైర్

హైదరాబాద్: తెలంగాణ మీ జాగీరా అన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరు ఉందని కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణ నాలుగు కోట్ల మంది జాగీరేనని కౌంటర్ ఇచ్చారు. బుధవారం (మే 3) జగిత్యాల జిల్లాలోని వెల్గటూర్ మండలంలో గోదావరి పుష్కర పనులను పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ మీ జాగీరా అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పవన్ కళ్యాణ్‎ను హీరోగా అందరూ అభిమానిస్తారని.. కానీ తెలంగాణపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే మాత్రం సహించమన్నారు. తెలంగాణ ఆంధ్ర ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నారని.. అలాంటి వారి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టవద్దని సూచించారు. 

భారతదేశంలోనే తెలంగాణ ప్రజలకు ఉన్న మంచి మనసు ఎవరికి ఉండదన్నారు. తెలంగాణ ప్రజలు దయాగుణంతో ఉంటారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేసిన వచ్చిన నష్టమేమి లేదని.. ఎవరూ పోటీ చేసిన కాంగ్రెసే మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.