ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు :మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు :మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
  • మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

గొల్లపల్లి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని, అత్యంత పేదలకు మొదటి ప్రాధాన్యమిస్తూ ఇండ్లు మంజూరు చేస్తున్నామని ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లొత్తునూరు గ్రామంలో 20 మంది లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గురువారం అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ విడతల వారీగా అర్హులైన ప్రతి కుటుంబానికి ఇండ్లు కేటాయిస్తామన్నారు. 

ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే వారికి ఇసుక ఉచితంగా ఇవ్వడమే కాకుండా, సిమెంట్, స్టీల్ ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పేదల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంటే దాన్ని ఓర్వలేక బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ ఆస్తి తగాదాల్లోనే చిక్కుకుని పోయిందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సంతోష్, వైస్ చైర్మన్ రాజిరెడ్డి, ఎంపీడీవో రాంరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నిశాంత్ రెడ్డి పాల్గొన్నారు.