అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కొండగట్టు, వెలుగు: కొండగట్టులో జరిగిన ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంతో నష్టపోయిన 31 కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. శుక్రవారం బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.83 లక్షల విలువైన చెక్కులను కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సత్యప్రసాద్‌‌‌‌‌‌‌‌తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లక్షలాది రూపాయలు అప్పులు చేసి సామగ్రి తెచ్చుకున్న దుకాణదారులు అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన దుస్థితిపై ప్రభుత్వం వెంటనే స్పందించిందన్నారు. 

తక్షణమే సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి బాధితులను ఆదుకునేందుకు సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ నుంచి రూ.83,12,000, విద్యుత్ సంస్థ నుంచి రూ.29 లక్షలు, డీఆర్‌‌‌‌‌‌‌‌డీవో ద్వారా మరో రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు చెప్పారు. వేములవాడ రాజన్న ఆలయం, కొండగట్టు, ధర్మపురి, కోటిలింగాల ప్రాంతాలను టెంపుల్ సిటీ కారిడార్‌‌‌‌‌‌‌‌గా అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, డీఆర్డీవో రఘువరన్, ఎస్‌‌‌‌‌‌‌‌ఈ సుదర్శన్, డీఈ గంగారాం, సర్పంచ్ ఆదిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.