టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు చంద్రబాబే కారణమన్నారు. చంద్రబాబు ముసలి సైకో అన్న అంబటి కోడెల ఆత్మహత్య చేసుకున్నప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు చంద్రబాబే కారణమన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. చంద్రబాబు దూరం పెట్టడంతోనే మానసిక క్షోభకు గురై కోడెల ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. విపక్షాలు ఆరోపణలు చేస్తే .. సంబంధిత వ్యక్తి స్పందించాలా ? మిగతా నేతలు మాట్లాడారా అని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబుకు అన్నివిధాలా సహాయం చేసిన కోడెల శివప్రసాద్‌ను అక్కున చేర్చుకోవాల్సింది పోయి .. అవమానించారని విమర్శించారు. ఓ వైపు కుటుంబసభ్యులు, మరోవైపు పార్టీ నుంచి కూడా సహకారం అందకపోవడంతోనే కోడెల బలవన్మరణానికి పాల్పడ్డారని పేర్కొన్నారు.
కోడెల శివప్రసాద్ 1983లో ఎన్టీఆర్‌తో టీడీపీలో ఉన్నారని గుర్తుచేశారు. టీడీపీలో ఎన్ని రాజకీయ సంక్షోభాలు వచ్చినా .. పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారే తప్ప మారలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరితే అనర్హత వేటు వేయకుండా స్పీకర్‌గా కాకుండా రాజకీయ నేతగా చంద్రబాబుకు సాయం చేయలేదా అని ప్రశ్నించారు. అందులో నలుగురు మంత్రులు చేసినా మిన్నకుండిపోయారని గుర్తుచేశారు. ఫర్నీచర్ అంశానికి సంబంధించి వర్ల రామయ్యతో చంద్రబాబు వ్యాఖ్యలు చేయించలేదా అని నిలదీశారు మంత్రి అంబటి రాంబాబు.
చంద్రబాబు చేసే నీచ రాజకీయాలను చూసిన కోడెల శివప్రసాద్ కుంగిపోయారన్నారు మంత్రి అంబటి రాంబాబు . ఇటు కూతురు, కుమారుడు చేసిన పనులు కూడా తలంపు తీసుకొచ్చాయన్నారు. అందుకోసమే ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ఆ సమయంలో సత్తెనపల్లి, నరసరావుపేట నుంచి కార్యకర్తలు వచ్చారే తప్ప చంద్రబాబు ఎందుకు రాలేదని అడిగారు. వారం రోజులు ఆస్పత్రిలో ఉన్న .. పక్కనే పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు .. కోడెల వద్దకు రాలేదన్నారు. కొందరు చొరవ తీసుకొని వెళ్లాలని కోరినా .. స్పందించలేదన్నారు. ఈ విషయాన్ని కోడెల అల్లుడు మనోహర్‌కు చెబితే ఆయన చంద్రబాబు వద్దకెళ్తే .. బండబూతులు తిట్టారని పేర్కొన్నారు.
