మైనార్టీల అభ్యున్నతే కాంగ్రెస్ లక్ష్యం:మంత్రి మహ్మద్ అజారుద్దీన్

మైనార్టీల అభ్యున్నతే కాంగ్రెస్ లక్ష్యం:మంత్రి మహ్మద్ అజారుద్దీన్
  • లబ్ధిదారులకు సబ్సిడీ పథకాలు అందజేత

బషీర్​బాగ్, వెలుగు: ప్రజా సంక్షేమం, అభివృద్ధితో పాటు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని మైనార్టీ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ అన్నారు. బుధవారం నాంపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్​లో తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సబ్సిడీ పథకాలను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కార్పొరేషన్ చైర్మన్ మహ్మద్ ఒబెదుల్లా కొత్వాల్​తో కలిసి ఆయన పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీలకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో గ్రామాల్లో భిక్షాటన చేసే ఫకీర్ల పునరావాసానికి మోపెడ్లు, యువతకు ఈ-స్కూటర్లు, వితంతు మహిళలకు 100 శాతం సబ్సిడీ రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. మైనార్టీలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, వారి సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.