రీ డిజైన్ వల్ల శబరి నదిని కోల్పోయాం.. వేల కోట్ల దోపిడీ చేశారు : మంత్రి భట్టి

రీ డిజైన్ వల్ల శబరి నదిని కోల్పోయాం.. వేల కోట్ల దోపిడీ చేశారు : మంత్రి భట్టి

బీఆర్ఎస్ ప్రభుత్వంలో.. కేసీఆర్ నిర్వాకం వల్ల ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో విధ్వంసం జరిగిందని.. లక్షల కోట్ల రూపాయలు నష్టం జరిగిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
>>>  ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు, రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్, దేవాదుల ఎస్సారెస్పీ ప్రాజెక్టులను 32 వేల 848 కోట్ల రూపాయలతో డిజైన్ చేస్తే.. కేసీఆర్ మాత్రం లక్షా 72 వేల కోట్ల రూపాయలకు తీసుకెళ్లారని స్పష్టం చేశారు మంత్రి భట్టి.
>>>  రీ డిజైన్ పేరుతో కేవలం వెయ్యి 400 కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టును.. కేసీఆర్ 23 వేల కోట్ల రూపాయలకు తీసుకెళ్లారని.. ఇందులో 8 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని.. అయినా ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదని.. అలాంటప్పుడు 8 వేల కోట్ల రూపాయలు ఎవరు ఎత్తుకెళ్లారని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు మంత్రి భట్టి.

>>> రీ డిజైన్ పేరుతో కేసీఆర్ చేసిన అతి పెద్ద తప్పు వల్ల శబరి నదిని తెలంగాణ రాష్ట్రం కోల్పోయిందని.. ఎవరైనా నదులను రాష్ట్రాలకు మళ్లిస్తారని.. కేసీఆర్ మాత్రం శబరి నదిని రాష్ట్రం కోల్పోయే విధంగా ప్రాజెక్టులు రీ డిజైన్ చేసి.. తెలంగాణకు అన్యాయం చేశారన్నారు మంత్రి భట్టి విక్రమార్క.
>>> 32 వేల కోట్లతో 31 లక్షల 30 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వటానికి ప్రాజెక్టులు డిజైన్ చేసిందని.. కేసీఆర్ మాత్రం లక్షా 47 వేల కోట్లు ఖర్చు పెట్టినా.. ఒక్క ఎకరానికి అదనంగా నీళ్లు ఇవ్వలేదని సభలో స్పష్టం చేశారు మంత్రి భట్టి.