ఏపీలో తయారైన తొలి కియా కారు మార్కెట్లోకి రిలీజ్ అయ్యింది. రెండేళ్ల క్రితం అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలో 530 ఎకరాల్లో కియా మోటర్స్ కంపెనీ ఏర్పాటు చేయడమే గాకుండా తొలి కారును కూడా తయారు చేసి ఔరా అనిపించారు. ఇవాళ కియా పరిశ్రమలో తయారైన తొలి కారును కియా సంస్థ ప్రతినిధులు, మంత్రులు బుగ్గన, శంకరనారాయణ, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజా ప్రారంభించారు.అనంతరం మాట్లాడిన బుగ్గన చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, కడప జిల్లాల్లో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని అన్నారు.
రాయలసీమలో పరిశ్రమల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని రోజా అన్నారు. ఏపీఐఐసీ నుంచి కియా మోటార్స్‌కు సహకరం అందిస్తామని వెల్లడించారు. కియాలో 75శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని కోరారు. వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో సెల్టాస్ మోడల్ తయారుచేసినట్ల కియా ప్రతినిధి భట్ తెలిపారు. ఏడాదిలో 3 లక్షల కార్లు తయారు చేస్తామన్నారు. మూడు వారాల్లో 25 వేల కార్లు బుకింగ్ అయినట్లు వెల్లడించారు.
