కార్పొరేట్‌‌‌‌ స్థాయి వైద్యాన్ని పేదలకు అందించడమే లక్ష్యం : మంత్రి దామోదర

కార్పొరేట్‌‌‌‌ స్థాయి వైద్యాన్ని పేదలకు అందించడమే లక్ష్యం : మంత్రి దామోదర
  • మంత్రి దామోదర రాజనర్సింహ

నారాయణ్‌‌‌‌ఖేడ్‌‌‌‌, వెలుగు : కార్పొరేట్‌‌‌‌ స్థాయి వైద్యాన్ని పేదలకు అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. నారాయణఖేడ్‌‌‌‌ నియోజకవర్గంలోని సిర్గాపూర్‌‌‌‌ మండలంలో ఏర్పాటు చేసిన పీహెచ్‌‌‌‌సీని శుక్రవారం ఎంపీ సురేశ్‌‌‌‌ షెట్కార్‌‌‌‌, ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్స్‌‌‌‌పై ప్రజలకు నమ్మకం కలిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. హెల్త్‌‌‌‌  డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో ఇప్పటికే తొమ్మిది వేల పోస్టుల భర్తీ చేశామని, భవిష్యత్‌‌‌‌లో మరో 8 వేల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. 

కాంగ్రెస్‌‌‌‌ హయాంలో విద్య, వైద్యానికే ఫస్ట్‌‌‌‌ ప్రయారిటీ ఇస్తున్నామని చెప్పారు. పేదలందరికీ మెరుగైన ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు. అంతకుముందు జుక్కల్‌‌‌‌ అటవీ శాఖ ఆద్వర్యంలో ఏర్పాటు చేయనున్న అర్బన్‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంప్‌‌‌‌ పార్క్‌‌‌‌తో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఓ ఫంక్షన్‌‌‌‌హాల్‌‌‌‌లో టీచర్లను సన్మానించారు. కార్యక్రమంలో అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ చంద్రశేఖర్, నారాయణఖేడ్‌‌‌‌ ఖేడ్‌‌‌‌ సబ్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ ఉమా హారతి, రెవెన్యూ, పంచాయతీ రాజ్‌‌‌‌, ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.