అందోల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

అందోల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

జోగిపేట, పుల్కల్, వెలుగు: అందోల్​ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు గురువారం  మంత్రి దామోదర రాజనర్సింహ​ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. చౌటకూర్ మండలం సుల్తాన్​పూర్ లో రూ.6.20 కోట్లతో నిర్మించే కేజీబీవీ భవనం, రూ .2.56 కోట్లతో నిర్మించే పీహెచ్​సీ భవనం,  జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో రూ.2 కోట్లతో నిర్మించే స్వాగత తోరణ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

అందోల్​లోని మహిళా నర్సింగ్ కాలేజీ, మహిళా పాలిటెక్నిక్ కాలేజీ, రూ. 40 లక్షలతో బస్సు షెల్టర్​ను ప్రారంభించారు. రూ.5.75 కోట్లతో నిర్మించే రెవెన్యూ డివిజనల్ ఆఫీసు,  రూ. 2.45 కోట్లతో నిర్మించే ఐసీడీఎస్​ భవనాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో నిర్మించిన  ఇందిరమ్మ మోడల్ ఇళ్లను  ప్రారంభించారు.  రూ.2.45 కోట్లతో నేరెడిగుంటలో పీహెచ్​సీ భవనం, మార్కెట్​ కమిటీలో రూ. 7.23 కోట్లతో చేపటే కంపౌండ్​, షాపింగ్ కాంప్లెక్స్​, రైతు వెయిటింగ్​హాల్​ ఇతర పనులకు శంకుస్థాపన చేశారు. 

కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య, అడిషనల్​కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డీవో పాండు, పీసీసీ ఉపాధ్యక్షుడు సంగమేశ్వర్, మార్క్​ఫెడ్​చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లయ్య , మాజీ కౌన్సిలర్లు నాగరాజ్​, సురేందర్ గౌడ్,  ప్రదీప్ గౌడ్ ,  ఏఎంసీ మాజీ చైర్మన్​ పద్మనాభ రెడ్డి పాల్గొన్నారు.