నాందేడ్, అకోల నేషనల్ హైవేపై ప్రమాదాల నివారణకు చర్యలు : మంత్రి దామోదర రాజనర్సింహ

 నాందేడ్, అకోల నేషనల్ హైవేపై  ప్రమాదాల నివారణకు చర్యలు : మంత్రి దామోదర రాజనర్సింహ
  • మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడి
  • ఎన్ హెచ్ ఏఐ అధికారులతో కలిసి పరిశీలన 

మెదక్/టెక్మాల్, జోగిపేట, వెలుగు: సంగారెడ్డి, మెదక్ జిల్లాల మీదుగా వెళ్తున్న నాందేడ్, అకోల నేషనల్ హైవే (161) పై  ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. సోమవారం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో కలిసి హైవే మీద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించారు. అందోల్ నియోజకవర్గంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో మంది చనిపోతున్నారని అందువల్ల అవసరమైన చోట్ల అండర్ పాసులు, ఫ్లై ఓవర్లను నిర్మించేందుకు చర్యలు  తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. 

చౌటాకూర్ మండల పరిధిలోని శివ్వంపేట, తాడ్దాన్ పల్లి చౌరస్తా, అందోల్ మండల పరిధిలోని అల్మాయిపేట, టేక్మాల్ మండల పరిధిలోని బొడ్మట్ పల్లి వద్ద యాక్సిడెంట్ స్పాట్లను మంత్రి అధికారులకు చూపిస్తూ, ప్రమాదాలు జరగకుండా చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు. రోడ్డు  ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు అవసరమైన చోట్ల అండర్ పాసులు, ఫ్లై ఓవర్ల పనులు మొదలుపెడతామని నేషనల్ హైవే అథారిటీ అధికారులు తెలిపారు.