పల్లెల ప్రగతికి ప్రభుత్వం ప్రాధాన్యం : మంత్రి దామోదర రాజనర్సింహ

పల్లెల ప్రగతికి ప్రభుత్వం ప్రాధాన్యం : మంత్రి దామోదర రాజనర్సింహ

టేక్మాల్, వెలుగు: పల్లెల ప్రగతికి  ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు  చేపడుతోందని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. టేక్మాల్​ మండలంలో ఆర్​అండ్​బీ, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో రూ.28. కోట్లతో పలు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా వసతి కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. మోడల్ స్కూల్, కాలేజీలకు మౌలిక వసతులు కల్పిస్తూ నాణ్యమైన విద్య అందించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

 మోడల్ స్కూల్ ను పరిశీలించిన మంత్రి మౌలిక వసతులపై కలెక్టర్ రాహుల్ రాజ్ తో చర్చించారు.  కంప్యూటర్ ల్యాబ్ వెంటనే ప్రారంభించాలని, కావాల్సిన అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో  మండల కాంగ్రెస్​పార్టీ అధ్యక్షుడు రమేశ్,  మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, ఆర్టీఏ మెంబర్​ మల్లారెడ్డి, జిల్లా కో ఆప్షన్ మాజీ మెంబర్​ యూసుఫ్, మండల కో ఆప్షన్ మాజీ మెంబర్​ మాన్ కిషన్, పాపయ్య,  విద్యాసాగర్, కిషోర్, సుధాకర్, అనిల్,  సంగమేశ్,  మహేశ్ రెడ్డి, సాయి శేషు, డీఎంహెచ్​వో శ్రీరామ్, ఆర్​అండ్ బీ ఈఈ సర్దార్ సింగ్, పీఆర్​ఈఈ నర్సింలు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి  నీలిమ, ట్రైబల్ వెల్ఫేర్ డీఈ భాషా పాల్గొన్నారు.