విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి : దామోదర రాజనర్సింహ

విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి : దామోదర రాజనర్సింహ
  • మంత్రి దామోదర రాజనర్సింహ

జోగిపేట, వెలుగు: విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత టీచర్లదేనని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం అందోల్​ మండలంలోని సంగుపేట గ్రామంలో  ఓ ప్రైవేట్​ ఫంక్షన్​హాల్​లో జరిగిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు.  

ప్రభుత్వం విద్య, వైద్య రంగాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఇప్పటికే మహిళా పాలిటెక్నిక్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, కేజీబీవీ,  మోడల్ స్కూల్, గురుకులాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. సుమారు 160 ఎకరాల్లో జేఎన్​టీయూను ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు  అందుకున్న అధ్యాపకులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.