సన్న బియ్యం వల్లే రేషన్ కార్డుల డిమాండ్ : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

సన్న బియ్యం వల్లే రేషన్ కార్డుల డిమాండ్ : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
  • అర్హులందరికీ ఇస్తం.. కంగారు పడొద్దు
  • మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వం సన్న బియ్యంతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందున రేషన్​కార్డులకు డిమాండ్​ఉందని రంగారెడ్డి జిల్లా ఇన్​చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బీఆర్ఎస్​హయాంలో రేషన్​కార్డులను విస్మరించారని, తాము మాత్రం అర్హులందరికీ ఇస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. శనివారం పెద్ద అంబర్ పేటలో కొత్త రేషన్​కార్డులను ఆయన పంపిణీ చేశారు. 

ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ, రైతు రుణమాఫీ, సన్న వడ్లకు బోనస్​, మహిళా సంఘాలకు రుణాలు, సర్కారు బడులకు భారీగా నిధులు కేటాయిస్తూ కాంగ్రెస్​ ప్రభుత్వం సంక్షేమం దిశగా ముందుకెళ్తోందన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, రోడ్ల అభివృద్ధి చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ చైర్మన్ చిలక మధుసూదన్ రెడ్డి ఉన్నారు.