హైదరాబాద్లో ఏఐ సమ్మిట్: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్లో ఏఐ సమ్మిట్: మంత్రి శ్రీధర్ బాబు
  • జూన్లో నిర్వహణ
  • బడ్జెట్​సెషన్లో ఐటీ, ఇన్ఫ్రా పాలసీలు

హైదరాబాద్: జూన్ లో హైదరాబాద్ లో ఏఐ సమ్మిట్ నిర్వహిస్తున్నామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.  త్వరలో ఏఐ సిటీ నిర్మించబోతున్నామన్నారు. మాదాపూర్​ఐటీసీ కోహినూర్ లో  జరిగిన టెలీ పర్ఫార్మెన్స్ ఇంప్రెసివ్  ఎక్స్ పీరియన్స్ సమ్మిట్ లో ఆయన మాట్లాడారు. ‘హైదరాబాద్ లో అనుకూల వాతావరణం, మానవ వనరులు, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ పుష్కలంగా ఉన్నాయి. 

స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నం. ఐఎస్బీ తరహాలో ఇది స్కిల్డ్ మ్యాన్ పవర్ అందిస్తుంది. టాటా, మహీంద్ర కంపెనీలు స్కిల్ వర్సిటీ స్థాపనకు ముందుకు వచ్చాయి. రాష్ట్రంలోని గ్రామాల్లోనూ కుటుంబానికి ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉన్నరు. కాంగ్రెస్ ప్రభుత్వం టూరిజంపైనా ప్రత్యేక దృష్టి పెట్టింది. రేపటి నుంచి బడ్జెట్ సెషన్ నిర్వహిస్తున్నం.

ALSO READ :- దేశ విభజన కుట్రలు సహించం .. రాజ్యసభలో మోదీ

ఐటీ, ఇండస్ట్రీ, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ పాలసీలు రూపొందిస్తం. ప్రపంచ శ్రేణి ఏఐ సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతాం’ అని మంత్రి తెలిపారు.