ప్రైవేట్  మెడికల్ కాలేజీల్లో కరోనా చికిత్స అందించండి

ప్రైవేట్  మెడికల్ కాలేజీల్లో కరోనా చికిత్స అందించండి

కరోనా కారణంగా కరోనా ట్రీట్మెంట్  బెడ్స్ ఇవ్వాలని  ప్రైవేట్  మెడికల్ కాలేజీల యాజమాన్యాన్ని కోరారు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ . కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. తెలంగాణలో రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో  రాష్ట్రంలోని  ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో  కరోనా చికిత్స అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. కొవిడ్‌ చికిత్సలు, ఆస్పత్రుల్లో పడకల ఛార్జీలు, సిబ్బంది కేటాయింపు, ఫీజుల వసూళ్లపై వారితో చర్చించారు. పేదలు ఆస్పత్రికి వచ్చినప్పుడు..వాళ్ళను ఆర్ధికంగా ఇబ్బంది పెట్టొద్దన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు మానవత్వం తో వ్యవహారించాలని కోరారు మంత్రి ఈటల.

డ్రగ్స్, ఆక్సిజన్ సరఫరా చేయాలని కోరామని.. ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు.ప్రైవేట్ లో మొత్తం 24 మెడికల్ కాలేజీల్లో  750 చొప్పున బెడ్స్ ఉంటాయన్నారు. గతంలో ప్రతి కాలేజీలో 100 బెడ్స్ ఇవ్వడంతో పాటు..కోవిడ్ రోగులకు ఉచితంగా వైద్య  చికిత్స అందించామని తెలిపారు.ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ కూడా ఉచితంగా ప్రజలకు అందిస్తామని తెలిపారు. కొన్ని టెస్ట్ లకు మాత్రమే ఛార్జ్ చేయమని..ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తామని చెప్పిందన్నారు.