పంచాయతీలను అందంగా తీర్చిదిద్దాలి : ఎర్రబెల్లి దయాకర్ రావు

పంచాయతీలను అందంగా తీర్చిదిద్దాలి : ఎర్రబెల్లి దయాకర్ రావు
  •     మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

గండిపేట, వెలుగు :  పంచాయతీలను అందంగా తీర్చిదిద్దాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు అన్నారు. రాజేంద్రనగర్‌లోని టీఎస్‌ఐఆర్‌డీలో గురువారం జరిగిన రాష్ట్రస్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్​–2023 అవార్డుల ప్రధానోత్సవానికి ఆయన  చీఫ్ గెస్టుగా హాజరై ..రాష్ట్రస్థాయిలో ఉత్తమ పంచాయతీలుగా ఎంపికైన పాలకవర్గాలకు అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం ప్రతి పల్లె ప్రగతి బాటలో పయనించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్  విజన్‌తో పాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. కొత్త పంచాయతీ రాజ్‌ చట్టంతో మారుమూల గ్రామాలు సైతం అభివృద్ధిలోకి వస్తున్నాయని చెప్పారు.

ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడాన్ని అదృష్టంగా భావించాలని సర్పంచ్​లకు మంత్రి సూచించారు. భవిష్యత్ తరాలు కూడా ఎంతో గొప్పగా చెప్పుకునే విధంగా గ్రామాల అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. కేంద్ర నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసి గ్రామాలను అభివృద్ధి చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో   పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా

కమిషనర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్లు, జడ్పీ చైర్​పర్సన్​లు, జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.