పాఠశాలలు క్లీన్ గా లేకపోతే ప్రిన్సిపల్ మీద చర్యలు

పాఠశాలలు క్లీన్ గా లేకపోతే ప్రిన్సిపల్ మీద చర్యలు

కరోనా కారణంగా ఇన్నాళ్లు మూతపడ్డ పాఠశాలలు సెప్టెంబర్ 1 నుంచి తెరచుకోనున్నాయి. అయితే పాఠశాలలు క్లీన్ గా లేకపోతే ప్రిన్సిపల్, గ్రామ సర్పంచ్, పంచాయతీ అధికారుల మీద చర్యలు తీసుకుంటామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. పాఠశాలలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తల్లిదండ్రులందరూ స్వాగతిస్తున్నారని ఆయన అన్నారు. స్కూల్స్ ప్రారంభం సందర్భంగా.. 30వ తేది లోపు స్కూళ్లను పరిశుభ్రంగా తయారు చేస్తామని ఆయన అన్నారు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల పరిధిలో ఉన్న స్కూళ్ల పరిశుభ్రత బాధ్యత మున్సిపల్, పంచాయతీ శాఖలదేనని ఆయన తెలిపారు. స్కూళ్లు పరిశుభ్రంగా ఉంచని స్కూల్ ప్రిన్సిపల్, సర్పంచ్, పంచాయతీ అధికారులపై చర్యలు తప్పవని ఆయన అన్నారు. ప్రతి స్కూల్ లో ఏఎన్ఎం, స్టాఫ్ నర్సు ఉండేలా చూస్తామని ఆయన అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ప్రోగ్రాం లాగా ఈ ప్రోగ్రాం కూడా విజయవంతం చేయాలని పాఠశాలల యాజమాన్యాలకు ఆయన సూచించారు. విద్యార్థులకు మాస్కులు గ్రామ పంచాయతీల నుంచి కొనిస్తామని ఆయన తెలిపారు.