సీఎం కేసీఆర్ ను మహాత్ముడితో పోల్చారు మంత్రి ఎర్రబెల్లి . తెలంగాణ కు స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్ముడు కేసీఆర్ అని చెప్పారు. తెలంగాణ ఇచ్చామని కాంగ్రెస్ చెప్తోందని… కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్నామమని వివరించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చింది బ్రిటీష్ వాడు కాదని… తెచ్చింది గాంధీ అన్నారు. ఇదే తరహాలో కేసీఆర్ కూడా తెలంగాణ తెచ్చారని వివరించారు. వరంగల్ కార్పొరేషన్ ఆఫీస్ లో కేసీఆర్ నిలువెత్తు విగ్రహాన్ని పెట్టాలన్నారు ఎర్రబెల్లి. వరంగల్ కు వరదలు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం సాయం చేయలేదని ఆరోపించారు. బీజేపీ ఒకటి, రెండు కార్పొరేట్ సీట్లు గెలిచి చేసేదేమే లేదని విమర్శించారు ఎర్రబెల్లి.
