పంట కొనుగోలు కేంద్రాలు ఉండాల్సిందే..

పంట కొనుగోలు కేంద్రాలు ఉండాల్సిందే..

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళు కేంద్రాలు ఉండాల్సిందే అంటూ కామెంట్ చేశారు మంత్రి ఈటల రాజేందర్. తాను ఏ పదవిలో ఉన్నా.. రైతు ఉద్యమాలకు మద్దతు ఉంటుందన్నారు. రైతు బంధుపై వస్తున్న ఫిర్యాదులపై సీఎంతో మాట్లాడతానన్నారు. అక్రమ పెన్షన్లతో అసలు లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని… మరోసారి వివరాలు సేకరించి…వారికి న్యాయం చేస్తామని చెప్పారు. కరీంనగర్ జిల్లా చల్లూరులో రైతు వేదిక ప్రారంభోత్సవంలో ఈ  కామెంట్స్ చేశారు ఈటల. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనాల్సిందేనని చెప్పారు. బాజాప్తా.. గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రం ఉండాల్సిందేనన్నారు. తాను మంత్రిగా ఉండొచ్చు ఇంకో పదవిలో ఉండొచ్చు గాక.. రైతు ఉద్యమం ఎక్కడ ఉన్నా తన మద్దతు ఉంటుందని తెలిపారు.

రైతుబంధు పథకం మంచిదే కానీ.. ఇన్ కం ట్యాక్స్ కట్టే వారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి, వ్యవసాయం చెయ్యని గుట్టలకు, లీజుకిచ్చే భూములకు.. రైతు బంధు ఇవ్వొద్దని రైతులు కోరుతున్నారని చెప్పారు ఈటల. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.అక్రమ పెన్షన్ల విషయంలో అసలు లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు మంత్రి. నిజమైన లబ్ధిదారులకు పెన్షన్లు రాకపోవడం అన్యాయమన్నారు. పెన్షన్లు రాక ఇబ్బందులు పడుతున్న వారి కోసం మరోసారి వివరాల సేకరణ జరిపి న్యాయం చేస్తామన్నారు. గ్రామగ్రామాన పెన్షనర్ల వివరాలను పూర్తిస్థాయిలో అప్డేట్ చేయాలని అధికారులను ఆదేశించారు.

see more news

నా స్టైలే వేరు..మేం తలచుకుంటే అడ్రస్ లేకుండా చేస్తం

బడ్జెట్ లో శాఖల వారీగా కేటాయింపులు

కుక్కకు ఘనంగా సీమంతం..అతిధులకు విందు భోజనం