
హైదరాబాద్ ఒక హెల్త్ హబ్ గా మారిందన్నారు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. ఫ్రాంటిక్స్ డయాబెటిస్ అవేర్నేస్ అండ్ రిసర్చ్ సోసైటీ ఆధ్వర్యంలో జరిగిన డయాబెటిక్ సదస్సులో పాల్గొన్న ఆయన… గురుకుల అనే కోర్స్ ని లాంచ్ చేశారు. ఒకప్పుడు ఏ ఒక్కరికో డయాబెటిక్స్ వచ్చేందని, కానీ ఇప్పుడు చాలా మంది ఈ సమస్యతో బాధపడ్తున్నారన్నారు ఈటల. అన్నిఆరోగ్య సమస్యలకు కారణం ఆహార విధానం, జీవనశైలిలో వచ్చిన మార్పులే కారణమని చెప్పారు.