ప్రపంచంలోనే గొప్ప టూరిస్ట్ ప్రాంతంగా కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్: గంగుల

ప్రపంచంలోనే గొప్ప టూరిస్ట్ ప్రాంతంగా కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్: గంగుల

కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్దిలో భాగంగా సింగపూర్, సౌత్ కొరియాలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాల పరిశీలనకు వెళ్లనున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. జూన్ 29వ తేదీ గురువారం ఆయన కరీంనగర్ లో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఆరుగురు సభ్యుల బృందం సింగపూర్ వెళ్తున్నామని మంత్రి తెలిపారు. సియోల్, ఓసో నగరాల్లోని ప్రఖ్యాత "బిగ్ ఓ" పౌంటేన్ లాంటివి పరిశీలిస్తామన్నారు.

5 రోజుల పర్యటనలో తనతో పాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్, కలెక్టర్ అర్వీ కర్ణన్, ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ రజత్ కుమార్, టూరిజం ఎండీ మనోహర్ వస్తున్నారని స్పష్టం చేశారాయన. దేశంలోనే కాదు ప్రపంచంలోనే గొప్ప టూరిస్టు ప్రాంతంగా కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ నిలవబోతోందని మంత్రి గంగుల పేర్కొన్నారు.