కేసీఆర్ తమ దగ్గర పుట్టనందుకు ఇతర రాష్ట్రాల వాళ్లు బాధపడుతున్నరు

కేసీఆర్ తమ దగ్గర పుట్టనందుకు ఇతర రాష్ట్రాల వాళ్లు బాధపడుతున్నరు

బీసీల దేవుడు కేసీఆర్

మల్లన్నకు మరోరూపంగా కొలుస్తున్నరు: మంత్రి గంగుల

టైమొచ్చినప్పుడు ఆయన దేశాన్ని ఏలుతడు

బీసీ కులాల ఆత్మగౌరవ భవనాలు కట్టిస్తున్నమని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీసీలందరికీ సీఎం కేసీఆర్​ దైవ సమానుడు అని, అలాంటి నాయకుడు తమకు ఉండాలని అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి గంగుల కమలాకర్​ కామెంట్​ చేశారు. రాష్ట్రంలోని యాదవ కులస్తులు తమ కులదైవం మల్లన్నను పక్కనపెట్టి, కేసీఆర్‌‌నే దేవుడిగా కొలుస్తున్నారన్నారు. కేసీఆర్​ తమ రాష్ట్రంలో పుట్టలేదెందుకని ఇతర రాష్ట్రాల ప్రజలు బాధపడుతున్నారని పేర్కొన్నారు. టైం వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ దేశానికి నాయకత్వం వహిస్తారన్నారు. బుధవారం ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్‌‌, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, నన్నపనేని నరేందర్‌‌, బొల్లం మల్లయ్యయాదవ్‌ లతో కలిసి తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్‌‌‌‌‌‌‌‌, బీసీలు వేర్వేరు కాదని.. బీసీలంతా శాశ్వతంగా టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌తోనే ఉంటారని గంగుల కమలాకర్​ పేర్కొన్నారు. ‘‘బీజేపీ దరిదాపుల్లోకి కూడా బీసీలు వెళ్లరు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌పై చేసిన కామెంట్లు సరికాదు. మేం 17 కులాలను బీసీ జాబితాలో చేర్చినం. బీసీల బడ్జెట్ పెంచాం. బీసీ కులాల ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నం. బీసీ పిల్లల కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలు కట్టించినం. ఇవన్నీ చేసినందుకు బీసీలు టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు దూరమవుతారా?” అని ప్రశ్నించారు. కుల వృత్తులకు సీఎం కేసీఆర్ పునర్వైభవం తీసుకొచ్చారని వినయ్ భాస్కర్ అన్నారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌  దేశ్‌‌‌‌కీ నేత అని మిగతా రాష్ట్రాల ప్రజలు ప్రశంసిస్తున్నారని చెప్పారు. మోడీ హయాంలో దేశం ఆర్థికంగా చితికిపోయిందని.. అన్ని వర్గాల ప్రజలు మోడీకి దూరమవుతున్నారని విమర్శించారు. ప్రతి ఎన్నికల్లోనూ బీసీలు టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు అండగా నిలుస్తున్నారని.. లక్ష్మణ్‌‌‌‌కు దమ్ముంటే కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయించాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద సవాల్ చేశారు. కె.లక్ష్మణ్‌‌‌‌ది ఉత్త డమ్మీ పోస్ట్‌‌‌‌ అని కామెంట్​ చేశారు. తెలంగాణ బీసీల కోసమే వచ్చిందా అన్నట్టుగా కేసీఆర్ పాలన ఉందన్నారు.

For More News..

ఫీజులు కట్టకున్నా ఆన్ లైన్ క్లాసులకు అనుమతించండి

కట్​ చేసిన జీతాలు 4 వాయిదాల్లో చెల్లింపు

యాదాద్రి ఓపెనింగ్ వాయిదా