మిల్లర్లకు మంత్రి గంగుల వార్నింగ్

 మిల్లర్లకు మంత్రి గంగుల వార్నింగ్

ఖమ్మం: తేమ శాతం పేరుతో తరుగు తీస్తోన్న మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు  మంత్రి గంగుల కమలాకర్. రైతులను ఇబ్బందులు పెడితే ఊరుకోమన్నారు. వడ్ల కొనుగోళ్లకు ఇబ్బంది లేకుండా..అసరమైనన్నీ గన్నీ సంచులు అందుబాటులో ఉంచామన్నారు. ధాన్యం అమ్మిన రైతులకు..డబ్బులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 
ఖమ్మం జిల్లా వైరా వ్యవసాయ మార్కెట్ యార్డును రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఆ తర్వాత ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పీ క్యాంపు ఆఫీసులో  ధాన్యం కొనుగోళ్ల పై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో మూడున్నర కోట్లతో నిర్మించిన బీసీ స్టడీ సర్కిల్ భవనాన్ని..మంత్రి పువ్వాడ అజయ్ తో కలిసి ప్రారంభించారు గంగుల. తెలంగాణ వచ్చాక..బీసీ కులాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ రాక ముందు 19 బీసీ గురుకులాలు ఉంటే..ఇప్పుడు 200 బీసీ గురుకులను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారన్నారు.